telugu navyamedia
సినిమా వార్తలు

రావేల ఓ. . !  ప్రియా ! ! 

priya bandhavi poetry corner

ఎదురు చూస్తున్నా !
కను రెప్పలు మూయకుండా ! !
నీ దివ్య మంగళ రూపాన్ని 
కన్నులారా చూడాలని 
క్షణము లే యుగములు గా 
బరువు గా గడుపుతున్న ! ! 
మనసు విప్పి 
మదిలో ని మాట
మధురముగా నీతో చెప్పాలని ! ! 
ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న
పరువమంతా నీ ముందు
పరచి పంచాల ని ! !
నీ బిగి కౌగిలిలో 
వెన్న పూస లా క్షణ క్షణం 
కరిగి పోవాల ని  ! !
ఈ క్షణమే నీలో 
నా అణువణువూ 
ఐక్యం చేయాలని ! ! 
రావేల నాప్రియా !  ! 
నా ప్రేమ సామ్రాజ్య ఏలిక ! 
నన్నేలగ ముద్దుల కృష్ణా ! ! 

-పల్లోలి శేఖర్ బాబు, కొలిమిగుండ్ల

Related posts