telugu navyamedia
సినిమా వార్తలు

ఇందిరా గాంధీ పాత్రలో ర‌వీనాటాండ‌న్‌

Raveena-Randon

ప్రముఖ కన్నడ హీరో య‌ష్ హీరోగా రూపొందిన “కె.జి.య‌ఫ్‌” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొద‌టి భాగం “కె.జి.యఫ్ చాప్ట‌ర్-1” తెలుగు, క‌న్న‌డ‌తో పాటు త‌మిళ‌, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌లై భారీ విజ‌యాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు రెండో భాగం “కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్-2” షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మొద‌టి భాగాన్ని మించి భారీ బ‌డ్జెట్‌, తారాగ‌ణంతో తెర‌కెక్కిస్తున్నారు నిర్మాత‌లు. ఎమర్జెన్సీ స‌మ‌యంలో జ‌రిగిన పీరియాడిక్ క‌థాంశంతో ఫిలింగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్ర కూడా కీల‌కంగా క‌న‌ప‌డనుంది. కాబ‌ట్టి ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్ర‌ కోసం బాలీవుడ్ న‌టి ర‌వీనాటాండ‌న్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌ర్లో సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి.

Related posts