telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీలో .. పథకాల డోర్ డెలివరీ .. రేషన్ బియ్యంతో మొదలు..

cm jagan on govt school standardization

తొలి కెబినేట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదలకు నేరుగా సరుకులు అందించేందుకు సరికొత్త ప్రణాళికను అమలు చేయనున్నారు. ఇక నుంచి రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాలకి వెళ్లాల్సిన పనిలేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు.

ఈ కార్యక్రమం సెప్టెంబర్ 5 నుంచి పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని ఈ రోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

Related posts