telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అక్టోబరు 2 నుంచి ఏపీలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డు

AP ration cards

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ  రేషన్‌ కార్డు జారీ చేస్తామని ఏపీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) తెలిపారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. గ్రామ సచివాలయం అక్టోబరు 2 నుంచి రేషన్‌ కార్డుల  ప్రక్రియ కొనసాగుతుందన్నారు.  దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో రేషన్‌ కార్డు అందజేస్తామని అన్నారు. గతంలో రేషన్‌ కార్డుల కోసం ఇచ్చిన 1.39 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

గతంలో అర్హత లేకపోయినా పైరవీల ద్వారా పొందిన కార్డులపై విచారణ చేపడతామన్నారు. రేషన్‌ దుకాణాలను స్టాక్‌ పాయింట్లుగా వాడతామన్నారు. డీలర్లను తొలగించడం లేదని, గతంలో ఇచ్చినట్లే వారికి కమీషన్‌ ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం రీ సైక్లింగ్‌ అయ్యేవన్నారు. దాన్ని నివారించడానికే బ్యాగ్‌ల ద్వారా ఇవ్వబోతున్నామన్నారు.

Related posts