telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 22(బుధవారం) రాశి ఫలాలు

మేషం : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. పెద్దలను కలుసుకుంటారు. చిరు వ్యాపారులకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

వృషభం : ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులను అదుపుచేసుకోవాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు అనుకూలం. వివాహ సంబంధాలకు అనుకూలం. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.

మిథునం : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడితో ఆందోళన ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు.

కర్కాటకం : ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. రుణం తీర్చే ప్రయత్నాలు చేస్తారు.

సింహం : ఆర్థికంగా అనుకూలం. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలకు అవకాశం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

కన్య : వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు చాలావరకు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

తుల : ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. స్నేహితుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు బాధ్యతలతో శ్రమపడాల్సి వస్తుంది.

వృశ్చికం : అసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బంది ఉండదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నిస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం.

ధనస్సు : ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకుంటే మంచిది. వృత్తి, వ్యాపారులకు అనుకూలం.

మకరం : వ్యాపారులకు లాభదాయకం. స్నేహితుల సహకారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఎవరికీ హామీలు ఉండొద్దు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు.

కుంభం : ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. చిరు వ్యాపారులకు అనుకూలం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. కోర్టు పనులు వాయిదాపడతాయి. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు కష్టంమీద పూర్తిచేస్తారు.

మీనం : ఆకస్మిక ధనలాభం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగంలో మార్పులకు అవకాశం. ఇతరులకు మీవల్ల మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలకు అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి నిపుణులకు ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది.

Related posts