telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 19(ఆదివారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దలను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అప్పులు తీరుస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వివాదాలకు పోవద్దు.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. రాజకీయ రంగంలోని వారికి అనుకూలం. శుభవార్తలు అందుకుంటారు. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం : ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి.

కర్కాటకం : ఆకస్మిక ధనలాభం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది.

సింహం : ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహ సంబంధాలకు అనుకూలం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్య : ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిరు వ్యాపారులకు అనుకూలం. రుణ ప్రయత్నం ఫలిస్తుంది.

తుల : ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త వ్యక్తులు కలుస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. దూర ప్రయాణాలకు అవకాశం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చికం : ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. హామీలు కూడా ఇవ్వవద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు : శుభవార్తలు వింటారు. వివాహ సంబంధాలకు అనుకూలం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారులు, వృత్తి, వ్యాపారులకు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం : ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభ వార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పెద్దలను కలుస్తారు.

కుంభం : ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఉద్యోగులకు స్థానచలనం ఉండే సూచనలు.

మీనం : ఆర్థికంగా పర్వాలేదు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలకు అవకాశం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Related posts