telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 16(గురువారం) రాశి ఫలాలు

మేషం : ఉద్యోగులకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగి పోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

వృషభం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థిక ప్రయత్నాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

మిథునం : దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలోని వారికి అనుకూలం. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చుల విషయంలో జాగ్రత్త.

సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు కష్టాన్నికి తగిన ఫలితం ఉంటుంది.

కన్య : ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సమయం అనుకూలం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు.

తుల : స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును. పరిచయాలు పెరుగుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగంలో విజయవంతంగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు ప్రారంభిస్తారు.

ధనస్సు : ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి.

మకరం : సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం : నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపా రులకు, స్వయం ఉపాధి రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం : దైవ, సాంఘీక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుభవార్త ఒకటి ఊరట కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు బాగుంటుంది.

Related posts