telugu navyamedia
telugu cinema news trending

నితిన్ భుజానికి గాయం… రష్మిక ట్వీట్

nithin-and-rashmika-mandanna

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. నితిన్ ను హిట్ పలకరించి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే “భీష్మ” అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ఈ విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు వెంకీ కుడుములు ఓ ట్వీట్ చేశారు. నితిన్ భుజానికి గాయమైన కారణంగా వచ్చేనెలలో సెట్స్ పైకి వెళతామని ఆ ట్వీట్ లో తెలిపారు. వెంకీ కుడుములు ట్వీట్ చూసిన రష్మిక “అయ్యో… నితిన్ భుజానికి గాయమైందా… ! నాకు తెలియదు సార్… ఇప్పుడు నితిన్ కు ఎలా వుంది? ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేసింది. రష్మిక ట్వీట్ పై నితిన్ స్పందించాడు. “రష్మిక నేను ఇప్పుడు బాగానే వున్నాను… షూటింగులో కలుసుకుందాం” అని ట్వీట్ చేశాడు.

Related posts

మే నెలలో .. పది ఫలితాలు ..

vimala p

ఇక పార్లమెంటులో సన్నీడియోల్, హేమామాలిని ఒకేచోట కూర్చోలేరు… !? 

vimala p

అందుకే పూరీని .. గుర్తుచేసుకోలేకపోయా.. : మహేష్ బాబు

vimala p