telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

మానవత్వం ఎక్కడుంది .. అంటున్న .. రష్మిక..

Rashmika Mandanna images

ఇటీవల నటీనటులు సామజిక మాద్యమాలలోనైనా సామజిక విషయాలపై స్పందిస్తున్నారు. ఇది స్వాగతించదగ్గ విషయం. అభిమానులు దీనిని హర్షిస్తున్నారు. ఇటీవల రాయచూరు నవోదయ ఇంజినీరింగ్ విద్యార్థిని మధుపత్తార్‌పై కొందరు అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమెతో బలవంతంగా సూసైడ్ నోట్ కూడా రాయించారని వెల్లడించారు.

ఈ దారుణ ఘటనపై కథానాయిక రష్మిక, సింగర్ చిన్మయి స్పందించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ మధుపత్తార్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి, పరిస్థితిని సీరియస్‌గా తీసుకుని మధు కోసం గాలించి ఉండాల్సిందని చిన్మయి అభిప్రాయపడింది.

ఈ ఘటనపై రష్మిక స్పందిస్తూ, ‘మానవత్వం ఎక్కడ? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు అత్యాచారానికి గురైంది, ఆమెను దారణంగా హత్య చేశారు. నిజంగా ఈ సంఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts