telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో లిప్ లాక్… స్పందించిన రష్మిక

Rashmika-and-Vijay-Devarakonda

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ను నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ టీజర్లో విజయ్, రష్మిక మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్ వైరల్ గా మారింది. ఈ టీజర్ కు విడుదలైన అన్ని భాషల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ కన్నడ ప్రేక్షకులు కొంతమంది మాత్రం ఈ టీజర్ పై ఫైర్ అవుతూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

దీనిపై స్పందించిన రష్మిక “నా పాత్రకు న్యాయం చెయ్యాలంటే అలాంటి సీన్ ఉండాలి. ఆ ముద్దు సీన్ ను సన్నివేశం డిమాండ్ చేసింది. కేవలం ఇలాంటి లిప్‌లాక్ సీన్ల ఆధారంగా మొత్తం సినిమాను జడ్జ్ చెయ్యకూడదు. “గీత గోవిందం” సినిమాలో కూడా లిప్‌లాక్ సన్నివేశం డిమాండ్ చేసింది కనుకే ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు. “డియర్ కామ్రేడ్’ సినిమాలో కూడా సన్నివేశం డిమాండ్ చేయడం వల్లే లిప్‌‌లాక్ చేయాల్సి వచ్చింది” అంటూ వివరణ ఇచ్చింది. “గీత గోవిందం” తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా కాలేజీ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా. ఈ సినిమా మే 31న విడుదల కానుంది.

గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ ని నిశ్చితార్ధం చేసుకొని, తరువాత పెళ్లి బ్రేకప్ చేసుకుంది. దీంతో అప్పటినుంచీ రక్షిత్ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. ఇలా ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ రష్మికపై ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు “డియర్ కామ్రేడ్”లో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్ చూసిన రక్షిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. రష్మిక మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.

Related posts