telugu navyamedia
సినిమా వార్తలు

రష్మికను ఏడిపించిన ఈ వీడియో ఇదే…

“ఛలో” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రష్మిక మందన్న. విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన “గీత గోవిందం” చిత్రంతో తెలుగునాట భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉత్తమ నటనకుగానూ రష్మిక “జీ సినిమా” అవార్డును అందుకుంది. ఈ నేపథ్యంలోనే రష్మిక అభిమానులు ఆమె కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను తయారుచేసి ట్విట్టర్లో షేర్ చేస్తూ ఆమెకు ట్యాగ్ చేశారు.

ఏ వీడియోలో “గీత గోవిందం” ఆడియో వేడుక విశేషాలు… ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూ బిట్స్… ఆ సినిమా స్టిల్స్ తో ఉన్నాయి. ఆ వీడియోను చూసిన రష్మిక “నేను ఎంతమాత్రం ఊహించలేదు… ఈ వీడియో చూస్తూ ఏడ్చేశాను… మీలా ప్రోత్సహించేవారు నా చుట్టూ ఉన్నందుకు నాకెంతో గర్వంగా వుంది. ఆనందంలో కన్నీళ్లు ఆగడం లేదు… ఐ లవ్ యు సో మచ్ గాయ్స్” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్”తో పాటు కన్నడలో కూడా రెండు సినిమాల్లో నటిస్తోంది.

Related posts