telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

జోరుమీద ఉన్న రష్మిక…

Rashmika

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మికా మందాన్న. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతోనే మంచి హిల్ అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కాజేసింది. ఆతరువాత వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఈ అమ్మడు అతితక్కువ సమయంలోనే మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌తో ‘భీష్మ’ సనిమాలతో బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంది. వరుస విజయాలు సాధిస్తున్నా ఈ ముద్దుగుమ్మ వచ్చిన ప్రతి ఆఫర్‌కు ఓకే చెప్పడం లేదు. కేవలం తను డిమాండ్ చేసినంత పారితోషికం చల్లించే సినిమాలకే సంతంకం చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ లక్కీ బ్యూటీ స్టైలిష్ స్టార్ హీరో తెరకెక్కుతున్నా పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో అర్జున్ సరసన చేస్తోంది. అంతేకాకుండా శర్వానంద్ నటిస్తున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోనూ చేస్తోంది. దానితో పాటుగా అక్కెనేని అఖిల్ నూతన సినిమాలోనూ రష్మిక కనిపించనుంది. వీటితో పాటు కార్తీ చేస్తున్నా ‘సుల్తాన్’సినిమాతో తమిళనాట కూడా అడుగు పెట్టేందుకు సిద్దం అవుతోంది. కన్నడలో ‘పొగరు’ అనే సనిమాలోనూ తన ప్రతిభను చూపింది. చూడాలి మరి ఈ సినిమాలు తనకు ఎంత సక్సెస్ ఇస్తాయి అనేది.

Related posts