telugu navyamedia
సినిమా వార్తలు

రష్మీ తండ్రి నెంబర్ కావాలంట… రష్మీ రియాక్షన్ చూడండి

Rashmi
బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మీ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉండే రష్మీ తరచుగా అభిమానుల సందేహాలకు తనదైన శైలిలో సమాధానాలిస్తూ ఉంటుంది. ఏ విషయాన్నయినా మొహమాటం లేకుండా బహిర్గతం చేస్తుంది. తాజాగా రష్మీ ఓ నెటిజన్ కు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
సోషల్ మీడియాలో రష్మీ తన అభిమానులతో చాట్ చేస్తుండగా ఓ నెటిజన్… మీతో యాడ్ చేయాలనుకుంటున్నాం, మీ నాన్నగారి నంబర్ మిస్ అయింది. ఆయన నంబర్ ఇస్తారా ప్లీజ్ అని అడిగాడు. దీంతో రష్మి అతడిపై ఫైర్ అయ్యింది. త‌నకు పన్నెండేళ్లప్పుడే తండ్రి చ‌నిపోయాడ‌ని… కాబ‌ట్టి త‌న తండ్రి నెంబ‌ర్ ఉండే ఛాన్సే లేద‌ని… పీఆర్ మేనేజ్‌మెంటే పేరు చెప్పి జనాలను ఫూల్ చేయొద్దని, మీలాంటి వాళ్ల వలన ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందంటూ మండిపడింది రష్మీ.

Related posts