telugu navyamedia
news telugu cinema news

విజయ్ సేతుతుపతి తో జత కట్టనున్న రాశిఖన్నా..

కోలీవుడ్ సినిమా యాక్టర్లు ఇప్పటికి మనకు చాలామంది గురించి పెద్దగా తెలియదు. తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, తెలుగు సినిమా వరకు వచ్చే సరికి చాలామంది బోల్తా కొడుతుంటారు. అందుకే ఆ నటులు అక్కడితోనే ఆగిపోతుంటారు.కానీ విజయ్ సేతుపతి మాత్రం అక్కడ ఇక్కడ మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు, హీరోగా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటిస్తూ అలరిస్తున్నాడు విజయ్ సేతుపతి. తాజాగా విజయ్ సేతుతుపతి  ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ”తుగ్లక్ దర్బార్”.ఈ సినిమాకు ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వంవహిస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా అదితీరావు హైదరిని హీరోయిన్ గా ఎంపిక చేశారు . లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక ఈ సినిమానుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్లో బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి – రాశీ ఖన్నా కాంబోలో ‘సంగ తమిజన్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.రాశీ ఖన్నా దీనిపై స్పందిస్తూ ‘తుగ్లక్ దర్బార్’ లో భాగం అయినందుకు సంతోషంగా ఉందని.. చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాశీ డీ గ్లామర్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.

Related posts

ఆ కిస్ సీన్ కోసం రెండు రోజుల పాటు ట్రైనింగ్‌…!

vimala p

మహారాష్ట్ర నాటకీయ పరిణామాలపై ప్రముఖ నటుడి రియాక్షన్

vimala p

యడియూరప్ప కేబినెట్ లో 17 మంది మంత్రులు

vimala p