telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రష్యా : .. అరుదైన వజ్రం .. వెలికితీత..

rare diamond found in russia

ప్రభుత్వ వజ్రపు గనుల వెలికితీత సంస్థ అల్‌ రోసా పీజేఎస్సీ నిర్వహిస్తున్న గనుల్లో మరో సరికొత్త వజ్రం దొరికింది. వజ్రం గర్భంలో మరో వజ్రం అటూ ఇటూ స్వేచ్ఛగా కదులుతూ ఉండటం గమనార్హం. ఈ వజ్రం దాదాపు 800 మిలియన్‌ సంవత్సరాల నాటిది అయివుండవచ్చని అల్‌ రోసా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తరహా వజ్రం కనిపించడం ఇదే తొలిసారని, దీన్ని ‘మట్రోష్కా డైమండ్‌’గా వ్యవహరిస్తారని తెలిపింది.

ఈ వజ్రం 0.62 క్యారెట్లుండగా, లోపలున్న వజ్రం 0.02 క్యారెట్లుందని వెల్లడించింది. ప్రకఅతి ఎన్నో రహస్యాలను దాచుకుని ఉందని, వాటిల్లో మానవాళికి తెలియనివే అత్యధికమని చెప్పడానికి ఇదో ఉదాహరణని అభిప్రాయపడింది.

Related posts