telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దిశ తరహాలో మరో ఘటన….ఓ మహిళను రేప్‌ చేసి

హైదరాబాద్‌ నగర శివారులో దిశ లాంటి మరో ఘటన వెలుగు చూసింది. నగర శివారులోని పాతబస్తీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణం హత్యకు గురైంది. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ఓ మహిళ దారుణంగా హత్య గురైంది. హత్య చేయబడ్డ మహిళ మొహంపై బండరాయి తో బలంగా మోదీ హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. హత్యకు గురైన మహిళ దుస్తులు లేకపోవడంతో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య కాబడ్డ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండడంతో… ఎవరో గుర్తు తెలియని దుండగులు మహిళను నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అని భావిస్తున్నారు పోలీసులు. సంఘటన స్థలంలో మహిళకు సంబంధించిన దుస్తులు, ఆధారాలను సేకరించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. 

 

Related posts