telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పవన్ తో బేదాభిప్రాయాలు ఉన్నాయన్న రాపాక.. నేడు జనసేన రైతు సౌభాగ్య దీక్ష…

janasena leader rapaka on ycp budget

పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పటికీ వారి సేవలను సద్వినియోగం చేసుకోవటంలో అధిష్ఠానం ఘోరంగా విఫలమైన విషయం వాస్తవమేనని జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ చెప్పారు. తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, తెలుగుభాషను కూడా సమానంగా చూడాలనే విషయాన్ని తమ అధినేత పవన్‌కళ్యాణ్ చెప్పినట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో విధిగా ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌తో పార్టీ పరంగా కొన్ని అంశాల్లో తనకు దూరం ఉన్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు తనకు తెలిసిన అనేక అంశాలను పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వరప్రసాద్ వివరించారు.

నేడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రైతు సౌభాగ్య దీక్ష చేపడుతున్నారు. కాకినాడ జేఎన్‌టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో జనసే న ఏర్పాట్లు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్‌ దీక్ష చేస్తున్నారు. గురువారం ఉదయం 7.30కు కాకినాడ జీఆర్‌టీ హోటల్‌ నుంచి నాదెండ్ల మనోహర్‌, నాగబాబుతో కలసి పవన్‌ దీక్షా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు.

Related posts