telugu navyamedia
crime

ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీస్ అధికారి దుర్మరణం..

car unlucky restuarent in denwar
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ఝుసి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన మనుబోతును (నీల్‌గై) ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి గరపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ధుండిబాగ్‌కి చెందిన మనీశ్ యాదవ్‌ యూపీలోని ఘజీపూర్ జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌గా  పనిచేస్తున్నారు.‌ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం డ్యూటీ ముగించుకుని తన స్వగ్రామానికి వస్తుండగానే ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మనీశ్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. 

Related posts

కశ్మీర్ వేర్పాటు వాద నేతలకు భద్రత ఉపసంహరణ 

vimala p

మొన్న ఎస్ ఆర్ నగర్ లో.. నిన్న నక్లెస్ రోడ్ లో.. ప్రేమజంటల పై దాడులు

vimala p

రూ.వేయి పెడితే రూ.లక్ష లాభమని నమ్మించి… రూ.25 కోట్లు పోగేసుకున్నాడు

ashok