telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ట్వీట్ నాది కాదు… అసలు నాకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు : రావు రమేష్

Rao-Ramesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ నటుడు రావు రమేష్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ – మీ రావు రమేష్” అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ తాను చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ స్పష్టం చేశారు. “నాకు సోషల్‌మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. వేటిల్లోనూ నాకు అకౌంట్ లేదు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నాను” అని రావు రమేష్ తెలిపారు.

Related posts