telugu navyamedia
సినిమా వార్తలు

అభినందన్ బయోపిక్ లో రణ్వీర్ సింగ్ ?

Ranveer Singh Lead Role In Abhinandhan Biopic
భారతీయ ఐ ఏ ఎఫ్ వింగ్ కమేండర్ అభినందన్  వర్థమాన్ బయోపిక్  కోసం సన్నాహాలు జరుగుతున్నాయా ?అభినందన్  వర్థమాన్  ఇప్పుడు భారత్ లో రియల్  హీరో . అతని అసమాన సాహసం చూసి దేశం మొత్తం గర్విస్తుంది . దేశం ఈ మారు మూలన చూసినా  అభినందన్  ముచ్చట్లే . యువకులు అతి మీసం పట్ల ఆకర్షితులై  అతన్ని అనుసరిస్తున్నారట . పుల్వామా లో పాకిస్తాన్ ప్రేరేపిత మానవ బాంబు దాడి  అనంతరం జేషే మహమ్మద్ స్థావరం వున్నా బాలాకోట్ పై మన సైన్యం దాడి చేసింది . 
రెండు దేశాల మధ్య పరస్ప దాడుల నేపథ్యంలో  అభినందన్  పాకిస్తాన్ విమానాన్ని కూల్చి ఆ గడ్డమీద దిగాల్చి వచ్చింది . అక్కడ నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కూడా అభినందన్  అంటే ఎంతో మంది భిమానిస్తున్నారు , అతన్ని చూసి గర్విస్తున్నారు . ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల కాలం నడుస్తుంది మరి అభినందన్ సాహసం , తెగువ , అసమాన ధైర్యం చుసిన తరువాత సినిమా తీయకుండా వుంటారా ?
ఇప్పటికే చాలామంది ఆ దిశగా పనులు మొదలు పెట్టారని అంటున్నారు . ఒక  మంచి మసాలా సినిమాకు కావలసిన అంశాలన్నీ అభినందన్ వీరగాథ లో వున్నాయి . ఇప్పటికే దీని మీద ఊహా గానాలు మొదలయ్యాయి . అభినందన్  పాత్రకు రణ్వీర్ సింగ్ అయితే బాగుంటుందని , ఈ సినిమాను  సంజయ్ లీలా భన్సాలీ  అయితే భారీగా నిర్మించగలడని , అతనికా టేస్ట్ ఉందని ఛాయా మంది అభిప్రాయం పడుతున్నారు . 
ప్రస్తుతము రణ్వీర్ సింగ్ “83” అనే సినిమా నిర్మాణంలో బిజీ గా వున్నాడు.  ఈసినిమా కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్నారు .ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకుడు . మరి చాలా మంది  ఊహిస్తున్నట్టు , ఆశిస్తున్నట్టు  రణ్వీర్ సింగ్ అభినందన్ సినిమా చేస్తాడా “లేదా?  అనేది కొద్దీ రోజుల్లో తెలుస్తుంది . అన్నట్టు రణ్వీర్ సింగ్ తాత పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వలస వచ్చాడు . 

Related posts