telugu navyamedia
సినిమా వార్తలు

ఇలాంటి సినిమా చేయడానికి సిగ్గులేదా ?… కియారపై కంగనా సోదరి ఫైర్ 

Kiara Advani images

బాలీవుడ్ బ్యూటీ కియారా తెలుగులో “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో ‘”బీర్ సింగ్” సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ బ్యూటీ “ఇందూ కీ జవానీ” అనే సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సినిమాలో కియారా డేటింగ్ యాప్స్ లో కనిపించే అబ్బాయిల ప్రోఫైల్స్ చూసి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని డేటింగ్ చేయాలనుకుంటుంది. దీని వలన ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కథతో సినిమాను రూపొందించనున్నారు. ఈ విషయాన్ని కియారా ప్రకటించిన వెంటనే నటి కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

”ఎవరైనా “ఇందూ కీ జవానీ” అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తారా..? ఓ పక్క మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోపక్క వారిని ఆట బొమ్మలుగా చూపిస్తున్నారు. ఒకవేళ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అంగీకరిస్తే అది ఆడవారికే అవమానకరము. మన భావితరాలు తలదించుకునే రోజులు వస్తాయి.. ఇలాంటి సినిమాలు తీయడానికి బాలీవుడ్ కి సిగ్గు లేదా..? ఈ రకమైన సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు తమ కుమార్తెల కళ్లల్లోకి చూడగలరా…? సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రంగోలి వ్యాఖ్యలపై కియారా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts