telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరణం కన్నా ఘోరమైన బాధను అనుభవించాం… “ఛపాక్” ట్రైలర్ పై రంగోలి ప్రశంసలు

Rangoli

యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ యదార్థ జీవితకథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే నటించిన చిత్రం “ఛపాక్”. మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపిక కనిపించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి, యాసిడ్ బాధితురాలు రంగోలీ కూడా దీపికపై, ఈ చిత్ర ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించింది. “అద్భుతం.. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రమిది. ట్రైలర్ చాలా అద్భుతంగా వుంది. మేఘనా గుల్జార్, దీపికా పదుకోనే ఈ సినిమా ద్వారా ఎన్నో భావోద్వేగపూరిత ప్రశంసల్ని అందుకుంటారు. నాపై జరిగిన యాసిడ్ దాడి వల్ల నేను, నా కుటుంబం మరణం కన్నా ఘోరమైన బాధను అనుభవించాం. యాసిడ్ బాధితుల కథ ఈ దేశం మొత్తం తెలియాలి” అని రంగోలీ పేర్కొంది.

Related posts