telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళ ఎఫ్‌ఆర్వోపై దాడి పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: మ్మెల్సీ జీవన్‌రెడ్డి

Congress Jeevan Reddy Contest MLC

ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్‌ కాగజ్‌నగర్‌ మండలంలో కొత్త సారసాల గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారిణిపై ఆదివారం జరిగిన దాడిని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశించి.. ఎమ్మెల్యే అనుచరులతో అధికారులపై దాడి చేయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూమూలపై గిరిజనులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు.పోడు భూములను గిరిజనుల నుంచి లాక్కునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు.

ఇప్పుడు గిరిజనలను బలవంతంగా వారికి కేటాయించిన పోడు భూముల నుంచి వెళ్లగొట్టటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. ఎఫ్‌ఆర్వో అనితపై కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని ఖండిస్తున్నామన్నారు. పోడు భూముల రక్షణకు స్థానిక ఎమ్మల్యే బాధ్యతలు తీసుకోవాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Related posts