telugu navyamedia
సినిమా వార్తలు

మాధవన్ కు పెళ్ళి ప్రపోజల్… ఆయన ఎలా రియాక్ట్ అయ్యారంటే… !?

R-Madhavan

ఒకప్పుడు లవర్ బాయ్ గా హీరో మాధవన్ కు ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ క్రేజ్ ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనంగా తాజాగా జరిగిన సంఘటనను చెప్పుకోవచ్చు. ఫేస్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన ముసలి తనం ఫొటోను మాధవన్.. అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. రోజంతా ప్రయాణం చేసొచ్చానని, తాను వృద్ధుడిని అయిపోయితున్నానని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఫొటో చూసిన ఓ లేడీ నెటిజన్ ఈ ఫోటో చూసిన ఓ అమ్మాయి కామెంట్ చేస్తూ.. ‘నాకు 18 ఏళ్లు.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. తప్పంటారా..?’ అని ప్రశ్నించింది. ఈ పోస్ట్‌పై స్పందించిన మాధవన్ “హ్హ హ్హ.. గాడ్ బ్లెస్ యూ… మీకు నాకంటే మంచి వ్యక్తి భర్తగా దొరుకుతాడు” అంటూ ఆశీస్సులు తెలిపారు. కాగా ప్రస్తుతం హీరో మాధవన్ ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’, ‘నిశ్శబ్ధం’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీలో మాధవన్ ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఆనంద్ మహాదేవన్‌, హీరో మాధవన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ‘నిశ్శబ్ధం’ చిత్రంలో మాధవన్ సరసన అనుష్క నటించనున్నారు.

Related posts