telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మేం విడిపోవడం వెనుక ఎవరి ప్రమేయంలేదు

ranbeer

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించి ప్లేబాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోనమ్ కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, ఆలియా భట్.. ఇలా రణ్‌‌బీర్ గాళ్‌ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దదే ఉంది. సోనమ్, దీపిక, కత్రినకు బ్రేకప్ చెప్పేసిన రణ్‌బీర్ ప్రస్తుతం ఆలియాతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరంతా సైలెంట్‌గానే ఉన్నప్పటికీ దీపిక మాత్రం చాలా సార్లు రణ్‌బీర్‌పై విమర్శలు చేసింది. రణ్‌బీర్, దీపిక విడిపోవడానికి కారణం రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ ప్రశ్నకు రణ్‌బీర్ సమాధానం చెప్పాడు. దీపిక ఇప్పటికీ నాకు మంచి స్నేహితురాలు. మేం ఎందుకు విడిపోయామన్నది పూర్తిగా మా వ్యక్తిగతం. మా అనుబంధంపై ఇద్దరికీ గౌరవం ఉంది. మేం విడిపోవడం వెనుక వేరెవరి ప్రమేయమూ లేదు. మీడియా అనవసరంగా ఇతరులను యాడ్ చేసి అసలు విషయాన్ని తప్పుదారి పట్టిస్తోంది. నా తల్లి నన్ను చాలా ప్రేమిస్తుంది. ఆమె ఎందుకలా చేస్తుంది. మా అమ్మకి కూడా దీపిక అంటే చాలా ఇష్టం. మేం విడిపోవడానికి మా అమ్మ కారణం కాదని రణ్‌బీర్ చెప్పాడు.

Related posts