telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెడ్డింగ్ కార్డ్ న్యూస్ పై స్పందించిన అలియా

Alia

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు కొన్నాళ్ళుగా ప్రేమాయ‌ణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. బహిరంగంగా కలిసి తిరిగే వీరిద్దరూ తమ ప్రేమ గురించి మీడియా ఎదుట కూడా అంగీకరించారు. వీరి కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఆమోదం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. వీరి వివాహానికి సంబంధించి అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అని కొంద‌రంటుంటే మ‌రి కొంద‌రు వ‌చ్చే ఏడాది వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని చెబుతున్నారు. అయితే రీసెంట్‌గా అలియా, ర‌ణ్‌బీర్ క‌పూర్ వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. జ‌న‌వ‌రి 22, 2020న జోధ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో అలియా భ‌ట్‌, ర‌ణ్‌భీర్ క‌పూర్ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కార్డ్‌లో ఉంది. అయితే ఈ కార్డ్ గురించి మీడియా అలియాని ప్ర‌శ్నించింది. ఇందుకు ఆమె గ‌ట్టిగా న‌వ్వి, న‌న్ను ఏం చెప్ప‌మంటారు. ఇది నిజం కాదు అని మ‌ళ్ళీ త‌మ పెళ్లి విష‌యాన్ని స‌స్పెన్స్‌లో పెట్టింది. ప్ర‌స్తుతం అలియా, ర‌ణ్‌బీర్ క‌పూర్ బ్ర‌హ్మ‌స్త్రా అనే చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు.

 

View this post on Instagram

 

Good morning ❤ #aliabhatt

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts