telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రెడీ” అంటున్న రానా… తండ్రి బాబాయ్ లతో కలిసి ఉన్న పిక్ వైరల్

Rana

దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ రోజు (శనివారం) రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రానా- మిహీక జోడీ ఒక్కటి కానున్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీలో సందడి వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కారణంగా రానా పెళ్లికి ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజరు కానున్నారని రానా తండ్రి సురేష్ బాబు పేర్కొన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులతో కలిపి అంతా కేవలం 30 నుంచి 50 మంది మాత్రమే హాజరవుతారని తెలిపారు. ఈ పెళ్లి వేడుక కోసం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోను ఎంతో అందంగా ముస్తాబు చేశారు. ఇక రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ కుటుంబం, రానా కుటుంబం అంతా కలిసి పెళ్లి మూడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన బాబాయ్, తండ్రితో కలిసి దిగిన ఓ లేటెస్ట్ పిక్ షేర్ చేశాడు పెళ్లి కొడుకు రానా.

సాంప్రదాయ దుస్తుల్లో బాబాయ్ వెంకటేష్, తండ్రి సురేష్ బాబుతో హుషారుగా ఓ ఫొటోకు పోజిచ్చిన రానా.. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ ”రెడీ” అనే కాప్షన్ ఇచ్చి బాంబ్స్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ఈ పిక్‌లో సురేష్ బాబు, వెంకటేష్, రానా ముగ్గురినీ అలా ఒకేచోట చూసిన దగ్గుబాటి ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ రానాకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts