telugu navyamedia
సినిమా వార్తలు

హాలీవుడ్ కు రానా ?

Rana

“బాహుబలి”తో భల్లాలదేవగా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు దగ్గుబాటి రానా. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, విలక్షమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రానా. కథ, కథనం కొత్తగా ఉండి, పాత్ర పవర్ ఫుల్ గా ఇతర భాషల్లో కూడా ఆయన నటిస్తారు. రానా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం రానా తలుపు తట్టిందనే వార్త ఫిలింనగర్ లో హల్చల్ చేస్తోంది. ఒక భారీ హాలీవుడ్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్ర కోసం రానాతో సంప్రదింపులు జరుపుతున్నారట. రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఆ సినిమా ఖరారైపోతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Related posts