telugu navyamedia
సినిమా వార్తలు

రానా సన్నబడడానికి కారణం ఇదే

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం” సినిమా చేస్తున్నాడు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. అయితే “బాహుబలి” సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని తేల్చేశాడు. “హాథీ మేరే సాథీ” సినిమా కోసమే సన్నబడాల్సి వచ్చిందని తెలిపాడు రానా. అడవిలోనే 30 సంవత్సరాలు వుండిపోయిన వ్యక్తి పాత్రలో నేను కనిపించాలి. ఈ పాత్ర కోసం నేను సన్నాబడాలని దర్శకుడు చెబితే అలాగే తగ్గుతూ వచ్చాను. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత మళ్లీ మునుపటి రానాలా మారిపోతానని ఆయన చెప్పాడు. మొత్తానికి తన గురించి జోరుగా సాగుతోన్న ప్రచారానికి రానా ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

Related posts