telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాహుబలి కంటే.. రజినీకాంత్ సినిమాలే బాగా ఆడాయి.. : రానా దగ్గుపాటి

rana daggupati on movie industry

న‌టుడు రానా ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోను రానా చ‌లాకీగా ఉంటాడు. ప్ర‌తి విషయాన్ని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతాడు. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూకి హాజ‌నైన రానాని ఓ యాంక‌ర్.. సౌత్ చిత్రాల‌ని చిన్న చూపు చూస్తున్న‌ట్టు మాట్లాడింది.

త‌న చిన్న త‌నంలో రోజా సినిమా చూసిన స‌దరు యాంక‌ర్‌కి ఆ త‌ర్వాత చూసిన సౌత్ సినిమాల‌న్నీ ఒకే ధోర‌ణిలో ఉన్న‌ట్టు అనిపించాయ‌ట‌. బాహుబ‌లి త‌ర్వాత సౌత్ ఇండియ‌న్ ఫిలిం మేకింగ్‌లో మార్పు వ‌చ్చింది అని త‌న అభిప్రాయాలని చెప్పుకొస్తుంది. ఇంత‌లోనే రానా మాట్లాడుతూ.. ఇండియ‌న్ సినిమా అభిమానుల‌కి ఇత‌ర భాష‌ల సినిమాల‌పై ఇలాంటి అభిప్రాయం ఉంటుంద‌ని అనుకోను. బాష గురించి ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అన్ని సినిమాల‌ని ఆద‌రిస్తారు.

బాహుబ‌లి కంటే ర‌జనీకాంత్ సినిమాలు అన్ని భాష‌ల‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. అవెంజ‌ర్స్ కూడా అన్ని భాష‌లలో రిలీజై విజ‌యం సాధించింది. మీరు చెప్పిన‌ట్టు సినిమాల‌కి భాషా స‌రిహ‌ద్దులు లేవ‌ని పేర్కొన్నారు రానా. ఆయ‌న మాట‌ల‌కి ఫిదా అయిన నెటిజన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Related posts