telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు రానా గ్రీన్ సిగ్నల్ ?

rana

ఇటీవలే రానా దగ్గుబాటి వివాహం మిహికా బజాజ్ తో హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పలువురు కీలక బంధువులు మరియు సినీ పెద్దలు సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే… రానా ఎప్పుడూ ఎక్కువుగా వైవిధ్యమైన సినిమాలు ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం రానా హీరోగా‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ సినిమాని డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో రానా కొత్తగా కనిపించబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడుమరో వినుత్నమైన సినిమా చేయడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు మిలింద్ రౌ దర్శకత్వం వహించబోతునట్లు బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. మిలింద్ ఇప్పటికే రానాకు కథను కూడా వివరించాడని.. రానాకి కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ అడ్వెంచర్ అట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

Related posts