telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా పెళ్లి సందడి… హల్దీ వేడుకలో అందంగా మిహికా…!

Rana

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా త్వరలో తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆగస్టు 8న తన ప్రియురాలిని రానా పెళ్లాడనున్నాడు. వీరి పెళ్లి సందడి షురూ అయింది. వివాహానికి ముందు జరిగే హల్దీ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మిహీకా పసుపు, ఆకుపచ్చ లెహంగాలో మెరిసిపోయింది. ఈ సందర్భంగా సీషెల్స్ డిజైనర్ ఆభరణాలను ఆమె ధరించారు. మరోవైపు పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇరు కుటుంబాల్లో పెళ్లి హడావుడి ప్రారంభమైంది. ఇరు కుటుంబాల నుండి కొద్ది మంది అతిథులు మాత్రమే వివాహానికి హాజరవుతున్నారు. అతిథులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్టు రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు తెలిపారు. చెఫ్ లు, సర్వర్ లకు కూడా పరీక్షలు జరుపుతున్నామని చెప్పారు.

Related posts