telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా ప్రేయసి టాటూ వైరల్

rana

రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దగ్గుబాటి రానా. ‘తను ఎస్ చెప్పింది’ అంటూ ఇటీవల తన ప్రేయసిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి, పెళ్లికి రెడీ అంటూ అందరికీ షాకిచ్చాడు. పెళ్లి ముహూర్తాల కోసం ఇరు కుటుంబాల పెద్దలు తాజాగా కలుసుకున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారని, త్వరలోనే వివరాలు ప్రకటిస్తారని సమాచారం. కాగా, తనకు కాబోయే భర్త పేరులోని తొలి అక్షరమైన `R`ను, తన పేరులోని తొలి అక్షరమైన `M`ను లవ్ సింబల్‌తో కలిపి తన చేతిపై మిహిక టాటూ వేయించుకుంది. ఈ ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts