telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సినిమా దమ్ము ఏంటో బాలీవుడ్ కు తెలిసింది : రానా

Rana

“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజాగా ఆయన తెలుగులో సంచలనం విజయాన్ని నమోదు చేసుకున్న “అర్జున్ రెడ్డి” బాలీవుడ్ లో “కబీర్ సింగ్” రీమేకై భారీ విజయాన్ని అందుకోవడం గురించి స్పందించారు. “ఇంతకుముందు దక్షిణాది సినిమాలంటే బాలీవుడ్ వారు చిన్నచూపు చూసేవారు .. ఎగతాళి చేసేవారు. కానీ రాన్రాను పరిస్థితులు మారుతూ వచ్చాయి. “బాహుబలి” నుంచి తెలుగు సినిమా దమ్ము పెరుగుతూ వెళుతోంది. తెలుగు కథలు తమ బలాన్ని చాటుకుంటున్నాయి. ‘టెంపర్’ రీమేక్ గా ఇటీవల హిందీలో రూపొందిన ‘సింబా’ .. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ గా రూపొందిన ‘కబీర్ సింగ్’ భారీ వసూళ్లను సాధిస్తూ ఉండటమే అందుకు నిదర్శనం. అమితాబ్ .. అక్షయ్ .. షారుక్ .. సల్మాన్ తెలుగు సినిమాలపై ఒక కన్నేసి ఉండటానికి కారణం, ఇక్కడి కథల్లో దమ్ము ఉండటమే” అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే బాలీవుడ్ లో ఓ యాంకర్ సౌత్ గురించి తక్కువగా మాట్లాడగా… రానా తనదైన శైలిలో కౌంటర్ వేసిన వీడియో వైరల్ అయినా విషయం తెలిసిందే.

Related posts