telugu navyamedia
సినిమా వార్తలు

శృంగార తారగా రమ్యకృష్ణ

Ramyakrishna
బాహుబలి సినిమాలో “శివగామి” పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఆ సినిమా తరువాత రకరకాల పాత్రలతో బిజీగా మారిపోయింది రమ్యకృష్ణ. అంతేకాదు తమినాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఓ తమిళ సినిమాలో శృంగార తారగా రమ్యకృష్ణ నటించనుందట. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం “సూపర్ డీలక్స్”. త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ “లీల” అనే శృంగార తారగా కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా నదియాను సంప్రదించగా, అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో  రమ్యకృష్ణను తీసుకున్నారట. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కన్పించనుండగా, సమంత కూడా రెండు సరికొత్త షేడ్స్ లో కనిపించనుందని తెలుస్తోంది.

Related posts