telugu navyamedia
సినిమా వార్తలు

జయలలిత బయోపిక్ : రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలుసా ?

Ramyakrishna
తమిళనాడు రాజకీయాలను జయలలిత ఎలా శాసించారో… ప్రజలను ఎంతగా ప్రభావితం చేశారో… వెండి తెరపై కథానాయికగా ఎలాంటి స్థానాన్ని సొంతం చేసుకున్నారో అందరికి తెలిసిన విషయమే. తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత నేత జయలలిత బయోపిక్ ను తెరకెక్కించడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఓ వైపున దర్శకురాలు ప్రియదర్శిని, మరోవైపున భారతీరాజా జయలలిత బయోపిక్ ను తమతమ కోణాల్లో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే జయలలిత జీవితచరిత్ర ఆధారంగా టీవీ సీరియల్ ను నిర్మించడానికి గౌతమ్ మీనన్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనే ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తాడా ? లేక నిర్మాతగా మాత్రమే ఉంటాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సీరియల్ 30 ఎపిసోడ్స్ తో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బుల్లితెరపై ప్రసారమవుతుందని తెలుస్తోంది.
ఇప్పటికే జయలలిత పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారని, టీవీలో ప్రసారమైన తరువాత ఇది వెబ్ సిరీస్ రూపంలో కూడా నెటిజన్లకు అందుబాటులో ఉండనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఓ విధంగా ఆమె హీరోయిన్ గా ఉన్నప్పటికీ కన్నా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే భారీగా ఆదాయాన్ని పెంచుకుంటోంది.
ఇప్పుడు రమ్యకృష్ణ ద్వారా వెబ్ సిరీస్ రూపంలో ఆమె జీవితాన్ని చూపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి రమ్యకృష్ణ 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శివగామి కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే హీరోయిన్లకంటే రమ్యకృష్ణకే ఎక్కువ క్రేజ్ ఉందంటున్నారు సినిమా నటులు.

Related posts