సినిమా వార్తలు

"మా" వెనుక సూత్రధారి సురేష్ బాబు ?

తెలుగు సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజముందంటూ యువనటీమణులు ఒక్కొక్కరే బయటకు వచ్చి తమ గళం విప్పుతున్నారు. సినిమా రంగంలో తాము ఎదుర్కున్న అవమానాలు, అవహేళనలు, అత్యాచారాల గురించి చెబుతుంటే తెలుగు సినిమా వెలుగు వెనక ఎంతటి చీకటి కోణాలున్నాయో తెలుస్తోంది. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో పాటు తనతో ఎవరెవరికి సంబంధం ఉందో వారి గుట్టును, బండారాన్ని బయట పెట్టి సంచలనం సృష్టించింది.

శ్రీరెడ్డి ఒక ఉద్యమంగా ప్రారంభించినప్పుడు ఒంటరిగానే పోరాటం సాగించింది. అయితే రాను రానూ ఛానెల్స్ లో చర్చల ద్వారా సమాజంలోని అనేకమందిని శ్రీరెడ్డి ప్రభావితం చేసింది. గ్లామర్ ను అడ్డం పెట్టుకొని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు చేస్తున్న అఘాయిత్యాలపై నిరసనలు, ఆందోళనలు ప్రారంభమయ్యాయి. సామాజిక కార్యకర్తలు శ్రీరెడ్డికి బాసటగా నిలబడ్డారు. అనేకమంది మద్దతు తెలపడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా తమవంతు సహకారమందిస్తామని ప్రకటించారు.

శ్రీరెడ్డి చేస్తున్న న్యాయ పోరాటానికి ఉస్మానియా జేఏసీ విద్యార్థులు మద్ధతు తెలపడమే కాకుండా గురువారం సాయంత్రం ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న మా అసోసియేషన్ కార్యాలయం ముందు బైఠాయించారు. సినిమా రంగంలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావిస్తూ ఇందులో ఇంతపెద్ద వారున్నా సహించేది లేదని, వారి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. సురేష్ బాబు, అతని కుమారుడు అభిరామ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోకపోతే వారి ఇంటిని, స్టూడియోను ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు.

సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పేరు బయటకు రావడంతో సురేష్ బాబు అప్రమత్తమై తన సన్నిహితులను సమావేశ పరిచి ఫిలిం ఛాంబర్ ద్వారా అత్యవసర సమావేశాన్ని పెట్టించారు. శ్రీరెడ్డి మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని, ఆమెతో కలిసి ఎవరైనా పనిచేయవచ్చని, ఆమెకు సభ్యత్వం ఇస్తున్నామని, ఛాంబర్, మా ప్రకటించింది. శ్రీరెడ్డి పోరాటానికి జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో తెలుగు సినిమా రంగం ఖంగుతింది. ఇలాంటి దుస్థితి వస్తుందని, శ్రీరెడ్డికి సరెండర్ కావాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఎవరూ ఊహించలేదు.

శ్రీరెడ్డి పోరాటానికి నైతిక మద్దతు లభించడమే కాకుండా ఇకముందు సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు ఇలాంటి లైంగిక వేధింపులు లేకుండా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుగు సినిమా ప్రకటించింది. శ్రీరెడ్డి పోరాటానికి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఆమె పోరాట పటిమ, తెగువలకు వర్మ సెల్యూట్ చేశాడు. శ్రీరెడ్డి పోరాటం ఫలించింది, ఫలితాలను ఇవ్వబోతోంది.

Related posts

హృదయం…

chandra sekkhar

బుల్లితెర చరిత్రలోనే సరికొత్త రికార్డు… “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో కౌశల్

vimala t

“పెట్ట”కు 3 మిలియన్ వ్యూస్… ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే…

vimala t

Leave a Comment