telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాత్రపై .. వర్మ ప్రేమాయణం..

Ram gopal Varma Fire Censor board

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘యాత్ర’ చిత్రంపై తన ప్రేమను, అభిమానాన్ని ప్రశంసల రూపంలో వర్షించారు. ఇది నిజమో లేక ఇది కూడా తన చిత్రం ప్రమోషన్స్ కి ఒక దారేనేమో; ఏమో అయ్యుండొచ్చు..!! తాజాగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ చిత్రం తీసిన విధానం, దర్శకుడు మహి వి రాఘవ్ పని తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘యాత్ర’ ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్ఆర్ పాత్రను చూపించిన విధానం చాలా బావుంది. ఆయన ఒక గొప్ప నాయకుడు. వైఎస్ఆర్‌ను సజీవంగా తెరపైకి తీసుకొచ్చిన మహి వి రాఘవ్‌ను అభినందించకుండా ఉండలేక పోతున్నాను. మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో జీవించారు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

‘యాత్ర’ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల నుంచి సైతం మంచి రేటింగ్స్ వచ్చాయి. ‘యాత్ర’ చిత్రం చూసిన తర్వాత వైఎస్ఆర్ అభిమానులు నుంచి తనకు వేలాది ఫోన్స్ వస్తున్నాయని ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకులు.

Related posts