telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

రాంగోపాల్ వర్మ.. రాజకీయాలలోకా…

RGV

ఇటీవల సినిమా వాళ్ళు కాస్త ఎక్కువగానే రాజకీయాల గురించి స్పందిస్తున్నారు. అందులో ముఖ్యంగా జస్ట్ ఆస్కిన్గ్ అంటూ మొదలుపెట్టాడు ప్రకాష్ రాజ్.. ఇప్పుడు ఆయన రాజకీయాలలోకి వచ్చేస్తున్నాడు. అలాగే ఇటీవల రాజకీయాల గురించి బాగా స్పందిస్తున్న మరో వక్తి రాంగోపాల్ వర్మ. ఆయన కూడా రాజకీయాలలోకి రానున్నాడా.. అంటూ వార్తలు వినపడుతున్నాయి. లేదా ఆయన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రచారం కోసం రాజకీయాలను వాడేసుకుంటున్నాడా అనేది కూడా ఇక్కడ వినిపిస్తున్న మరో వార్త. చూడాలి మరి సారు రాజకీయాలలోకి వచ్చి, దానిని ఎంత విచిత్రంగా చూపిస్తాడోమారి… తాజాగా వర్మ చేసిన కామెంట్స్ ఈ వార్తలకు నేపధ్యాన్ని ఇచ్చాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వెన్నుపోటు, ఎందుకు పేరుతో రెండు పాటలను వర్మ విడుదల చేశారు. దీంతో రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది.

తాజాగా క్రిష్ దర్శకత్వంలో విడుదలైన ‘ఎన్టీఆర్-కథా నాయకుడు’ సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా కంటే ఎన్టీఆర్, చంద్రబాబుపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు ఇచ్చిన ఇంటర్వ్యూకు ఎక్కువ హిట్లు వస్తున్నారని సెటైర్లు వేశారు. ఈరోజు వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఓవైపు ఎన్టీఆర్ సినిమాలను ఫేమస్ చేసే ప్రయత్నంలో మేమంతా ఉంటే, నాదెండ్ల భాస్కరరావు అంతకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు. నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూకు వస్తున్న హిట్లు, కథానాయకుడు సినిమా కలెక్షన్లను మించిపోతున్నాయి. దేవుడు, ప్రజలు.. ఎవరూ జరగబోయేదాన్ని అంచనా వేయలేరు అనడానికి ఇదే సాక్ష్యం’ అని ట్వీట్ చేశారు.

Related posts