telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రామాయణం”లో నటిస్తే బోల్డ్ ఫోటోషూట్ ఆఫర్ చేశారు…!?

Ramayan

ఒకప్పుడు ‘రామాయణం’, ‘మహాభారతం’ వంటి సీరియల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. అందులో నటించేవారినే దేవుళ్లు అనుకునేంతగా ఆడియన్స్ నిమగ్నమైపోయి ఆ సీరియల్స్‌ని చూసేవారు. ముఖ్యంగా 1980ల్లో దూరదర్శన్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘రామాయణ్’ సీరియల్‌కు బాగా పేరొచ్చింది. ఇందులో అరుణ్ గోవిల్ అనే హిందీ నటుడు రాముడి పాత్రలో నటించారు. దీపిక చిఖాలియా సీత పాత్రలో, సునీల్ లహ్రీ లక్ష్మణుడి పాత్రలను పోషించారు. ఈ సీరియల్‌ బాగా హిట్ అవడంతో ముగ్గురి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. దాంతో కొన్ని మ్యాగజైన్లు వీరి చేత బోల్డ్ ఫొటోషూట్స్ చేయించాలని అనుకున్నాయట. అంటే రాముడు, సీత, లక్ష్మణుడి క్యారెక్టర్స్ చేసిన వీరి ముగ్గురితో బోల్డ్ ఫొటోషూట్ చేయించాలని ఎన్నో అంతర్జాతీయ మ్యాగజైన్లు తమను సంప్రదించాయని అరుణ్ గోవిల్ తెలిపారు. ఇందుకు తమ ముగ్గురిలో ఎవ్వరూ ఒప్పుకోలేదని వెల్లడించారు. కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తామంటూ బలవంతం చేసారట. అయినా వారు ఒప్పుకోలేదు. అంత పవిత్రమైన పాత్రల్లో నటించి ఇలాంటి ఫొటోషూట్స్‌లో పాల్గొంటే ప్రజలకు తమపై ఉన్న గౌరవం, నమ్మకం పోతుందని అందుకే ఎంత డబ్బు ఇస్తామన్నా ఆ ఫొటోషూట్స్ చేయడానికి ఒప్పుకోలేదని తెలిపారు. అయితే రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ కొన్ని నెలల క్రితం ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ ఓమాటన్నారు. ఈ సీరియల్‌లో నటించడం వల్ల తనకు సినిమా అవకాశాలే లేకుండాపోయానని చెప్తూ బాధపడ్డారు.

Related posts