telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రమణదీక్షితులు వ్యాఖ్యలను తప్పుబట్టిన టీటీడీ ఛైర్మన్

Ramanadeekshulu

తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 15 మంది అర్చకులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. మరో 25 మంది రిపోర్టులు రావాల్సి ఉందని చెప్పారు. తిరుమలలో భక్తులకు దర్శనాలు వద్దని తాను చెపుతున్నా టీటీడీ ఈవో, ఏఈవో పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలనే పాటిస్తున్నారని విమర్శించారు.

ఈ నేపథ్యంలో రమణదీక్షితులు వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే టీటీడీ బోర్డుకు తెలుపాలని మీడియా ముఖంగా మాట్లాడటం సరికాదని అన్నారు.టీటీడీ విషయంలో రమణదీక్షితులు రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. రమణ దీక్షితులుని ముఖ్యమంత్రి జగన్ గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించారని గుర్తు చేశారు. అర్చకుల విషయంలో టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

Related posts