telugu navyamedia
సినిమా వార్తలు

“రామ్ వర్సెస్ రావణ్” సినిమా మొదలైంది

సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రామ్ వర్సెస్ రావణ్” . ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ “రామ్ వర్సెస్ రావణ్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రామ్ వర్సెస్ రావణ్” సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా వచ్చారు .

దర్శకుడు కె . శుక్రన్ మాట్లాడుతూ…నేను దర్శకత్వ శాఖలో రాజమౌళి గారి దగ్గర బాహుబలి సినిమాకు పనిచేశాను. అంతకముందు వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ గారి దగ్గర చేశాను. నాకు మొదట ఏంజెల్ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చింది సింధూర పువ్వు కృష్ణారెడ్డి గారు. ఆయన నాకు దేవుడు లాంటి వారు. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా దర్శకులు రాజమౌళి, వైవీఎస్ చౌదరి, శ్రీనివాస రెడ్డి, ఎన్ శంకర్ వీళ్లందరి వల్లే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా మిత్రుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది. రామ్ వర్సెస్ రావణ్ విషయానికొస్తే…ఇదొక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం అన్నారు.

హీరో సొలమన్ జడ్సన్ మాట్లాడుతూ…రామ్ వర్సెస్ రావణ్ చిత్రంలో నేను రామ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇదొక మంచి సినిమా . ఒక పల్లెటూరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరించేందుకు రామ్, రావణ్ అనే యువకులు ఏం చేశారు, ఎలా పోరాడారు అనేది కథ. అన్నారు.

రాజ్ బాలా మాట్లాడుతూ…నేను ఈ మూవీలో రావణ్పాత్ర క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. దర్శకుడు శుక్రన్ గారు నాకు బాహుబలి టైమ్ నుంచి మంచి మిత్రులు. నన్ను హీరోగా చాలా సినిమాలకు రికమెండ్ చేశారు. రామ్ వర్సెస్ రావణ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అన్నారు.

హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ…నేను పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. తమిళ్ లో రెగ్యులర్ గా మూవీస్ చేస్తుంటాను. దర్శకుడు శుక్రన్ గారు నాకు రామ్ వర్సెస్ రావణ్ కథ చెప్పినప్పుడు చాలా బాగుందని అనిపించింది. ముందుగా నాకు ఈ చిత్ర టైటిల్ బాగా నచ్చింది. ఈ టీమ్ తో ట్రావెల్ అవుతుంటే…ఒక సూపర్ హిట్ సినిమా చేసేందుకు గట్టి నమ్మకంతో ఉన్నట్లు అర్థమయ్యింది.. అన్నారు.

Related posts