telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘రెడ్’ సినిమాకి అదిరిపోయే మార్కెట్…

red

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వ‌స్తోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ‌ స్రవంతి మూవీస్ ప‌తాకంపై స్రవంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్లర్ కం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెడ్ సినిమాలో డ్యూయల్ రోల్ చేసాడు రామ్. టీజర్‌లో ఈ రెండు పాత్రలను పరిచయం చేశారు. ‘తడమ్’ అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. నివేథా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్‌లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ మంచి టాక్ తెచ్చకోవడంతో సినిమాకు మార్కెట్ అదిరిపోయే రేంజ్‌లో జరిగిందని టాక్. అందులో భాగంగా ఈ సినిమా కోసం బయ్యర్లు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఆంధ్రలో ఈ సినిమా థియేటర్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే సీడెడ్ ను 4 కోట్లకు అమ్మారు. ఇక నైజాం, వైజాగ్, కృష్ణలో శ్రీ స్రవంతి మూవీస్ సొంతంగా రిలీజ్ చేసుకోనుందట.

Related posts