telugu navyamedia
సినిమా వార్తలు

రామ్ “ఇస్మార్ట్ శంకర్”ను ఎవరికి డేడికేట్ చేశాడంటే ?

Ismart-Shankar

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సందర్భంగా శ‌నివారం చిత్రయూనిట్ సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ.. “సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉందంటే.. అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్‌ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మగారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను” అన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ “నాకు చాలా క్రూషియల్ టైమ్‌లో ఈ హిట్ వచ్చింది. ఇది కెరీర్‌కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన పూరిగారికి, అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఛార్మిగారికి థాంక్స్. రామ్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే న‌భా న‌టేశ్‌ బాగా నటించింది” అన్నారు.

Related posts