telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో సినిమాను లైన్ లో పెట్టిన రామ్… ఎవరితో అంటే..?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన రీసెంట్ సినిమా ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ తనలోని మాస్ యాంగిల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత వెంటనే రెడ్ అంటూ డబుల్ రోల్ చేశారు. ఈ సినిమాలో రామ్ చేసిన రెండు పాత్రల్లో ఒకటి పక్కా మాస్ లుక్స్‌తో ఉంటే మరొకటి పక్కా క్లాస్ లుక్స్‌తో ఉంటుంది. ఈ సినిమాతో కూడా రామ్ అందరినీ మెప్పించారు. రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ సరికొత్త కాంబో సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శీను తో సినిమా చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి భయాలతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts