telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామ్ కొత్త సినిమా అప్డేట్..

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన రీసెంట్ సినిమా ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రామ్ తనలోని మాస్ యాంగిల్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత వెంటనే రెడ్ అంటూ డబుల్ రోల్ చేశారు. ఈ సినిమాలో రామ్ చేసిన రెండు పాత్రల్లో ఒకటి పక్కా మాస్ లుక్స్‌తో ఉంటే మరొకటి పక్కా క్లాస్ లుక్స్‌తో ఉంటుంది. ఈ సినిమాతో కూడా రామ్ అందరినీ మెప్పించారు. ఈ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రేపటితో క్లారిటీ రానుంది. తాజాగా రామ్ కొత్త సినిమా గురించి రేపు ఓ అప్డేట్ రానున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేసారు. అయితే రామ్ తన కొత్త సినిమా తమిళ దర్శకుడు లింగు స్వామీతో చేయడానికి చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్‌తో అతడి సినిమా ఓకే అయ్యిందా.. లేదా అంటే రేపటి వరకు వేచి చూడాలి. రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. మరి రామ్ తన తదుపరి చిత్రంగా ఎటువంటి కథను ఎంచుకుంటారో వేచి చూడాలి.

Related posts