telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ కొత్త సినిమా… ఫస్ట్ లుక్ అదిరింది

Red

సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ఖరారైంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘రెడ్‌’ అనే టైటిల్‌ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ చిత్రం టైటిల్‌ని, ఇందులో హీరో రామ్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్‌ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్‌ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు.

Related posts