telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చంద్రబాబు, లోకేష్ అమ్మరాజ్యంలో సినిమాకు రివ్యూ ఇవ్వండి : వర్మ

varma

తాజాగా లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి ఎవరూ కాలు బయటికి పెట్టడం లేదు. సెలబ్రిటీస్ అయితే అందరికీ ఆదర్శంగా ఉండాలని.. అసలు బయటికే రావడం మానేసారు. పూర్తిగా హౌజ్ అరెస్ట్ అయిపోయారు. ఇలాంటి సందర్భంలో వర్మ సంచలన ట్వీట్ చేసాడు. మొన్నీమధ్య ఈయన తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ఎలాంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో పూర్తిగా తెలుగుదేశంకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రీకరించాడు వర్మ. దానికితోడు చంద్రబాబు, లోకేష్, పవన్ లాంటి నాయకులపై కూడా ఇష్టమొచ్చినట్లు సెటైర్లు వేసాడు. ఇక కేఎ పాల్‌తో అయితే ఆడుకున్నాడు. సినిమాలో జగన్‌ను మాత్రమే ప్రశంసించాడు. ఆయనే తిరిగి ముఖ్యమంత్రి అయినట్లు చూపించాడు వర్మ. ఈ చిత్రంపై ఎన్నో విమర్శలు చేసారు తెలుగుదేశం నాయకులు. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాను చంద్రబాబు, లోకేష్ కోసమే అక్కడ వేసారంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. లాక్ డౌన్ కారణంగా ఎలాగూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ ఈ సినిమాను చూసి విలువైన ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరాడు వర్మ. దాంతో తెలుగు తమ్ముళ్లు మండి పడుతున్నారు.

Related posts