telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “థ్రిల్లర్” ట్రైలర్… అది దెయ్యమా? లేక కిల్లరా?

Thriller

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేశారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది ‘థ్రిల్లర్’. అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీకి ఇప్పటికే కావాల్సినంత ప్రచారం చేసేశారు వర్మ. తాజాగా “థ్రిల్లర్” ట్రైలర్ ను విడుదల చేశారు వర్మ. 2 నిమిషాల 36 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ దట్టించారు వర్మ. అప్సరా రాణి హాట్ అందాలను ఫోకస్ చేస్తూ మరోసారి కెమెరా ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇది దెయ్యమా? లేక కిల్లరా? అని ప్రశ్నిస్తూ రామా.. కృష్ణా.. శివ శివ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో హోరెత్తించారు. చివరగా ఇది థ్రిల్లర్ అని తెలుపుతూ అంతా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు వర్మ. ఏకంగా 9 భాషలు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో) ఈ ట్రైలర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీలో అతిత్వరలో విడుదల చేయనున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts