telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

వారిపై పరువునష్టం దావా వేస్తాం: రామ్ గోపాల్ వర్మ

varma not ready to leave tdp and tarak

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించిన ఆరుగురిపై పరువు నష్టం కేసులు వేస్తామని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు.క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై వర్మ మరోసారి సెటైర్లు వేశారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న పాల్… తన సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ను మాత్రం ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు.

తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, టైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ తెలిపారు. కేసులను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం, విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తమకు నష్టం జరిగిందని చెప్పారు. ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని అన్నారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు.

Related posts